చాలా కాలేజీల్లో భర్తీ కాని సీట్లు
డిగ్రీవైపు మొగ్గుచూపుతున్న విద్యార్థులు
ఇతరరాష్ట్రాలకు తరలిపోతున్న వారి సంఖ్యా ఎక్కువే
హైదరాబాద్/అమరావతి,జూన్11(జనం సాక్షి): ఉభయతెలుగు రాస్ట్రాల్లో ఏయేటికాయేడు ఇంజనీరింగ్‌పై మోజు తగ్గుతోంది. ఎంసెట్ రాసిన వారిలో చాలామండి అప్షన్లు ఇవ్వకుండా డిగ్రీ కాలేజీల్లో చేరుతున్నారు. పక్కాగా ఐఐటి, లేదీ నీట్ల్ఓ సీటు వస్తుందంటేనే అటువైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక రంగం పటిష్ఠంగానే ఉంది. ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థులు ఇదివరకు ఎక్కువగా ఇంజినీరింగ్‌పైనే ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తగిన వసతులు, ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల విద్యార్థుల్లో ఆదరణ తగ్గుతూ వస్తోంది. ప్రాంగణ ఎంపికల్లో కూడా కంపెనీలు బాగా తగ్గించుకున్నాయి. దీంతో త్వరితగతిన ఉద్యోగం సాధించాలనే తపనతో విద్యార్థులు డిగ్రీ వైపు మొగ్గుచూపుతున్నారు.డిగ్రీ అనంతరం బ్యాంకు, సివిల్స్, గ్రూప్స్ తదితర వాటివైపు వెళ్లవచ్చని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దీని కారణంగానే పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీకాకుండా ఉండిపోతున్నాయి.చాలా ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.. పలు కోర్సులకు ఆదరణ కొరవడింది. ఏవో ఒకటి రెండు కోర్సులకు తప్ప మిగలినవాటివైపు అభ్యర్థులు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ఆయా కళాశాలలు సంకట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఎంసెట్‌లో ద్యార్థులు ఆశించిన స్థాయిలోనే అర్హత సాధించారు. అయితే అందుకు తగ్గట్టుగా విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకపోవడం.. ఆయా కళాశాల యాజమాన్యాలను కలవరానికి గురిచేస్తున్నాయి. పేరున్న కొన్ని కళాశాలల్లో మాత్రమే డిమాండ్ ఉన్న కోర్సులను విద్యార్థులు ఎంచుకొన్నారు. ఇటీవల జరిగిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకును బట్టివారికి ఆన్లైన్ ద్వారా వారు ఎంచుకున్న కోర్సుల్లో సీట్ల కేటాయింపు మొదటి విడతగా పూర్తయింది. విద్యార్థులు ఎక్కువగా సీఎస్ఈ, ఈసీఈ కోర్సులనే ఎంచుకున్నారు. దీంతో కొన్ని కళాశాలలు నిర్వహించాలా.. ఎత్తివేయాలా..అనే డలైలామాలో పడ్డాయి. కొన్ని యాజమాన్యాలైతే తమ కళాశాలను దగ్గరిలోని మరో కళాశాలలో విలీనం చేయడమో..లేదా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని కళాశాలల్లో పదిశాతం కూడా సీట్లు భర్తీకాలేదు. ఇకపోతే రెండోవిడత కౌన్సెలింగ్‌లో మరో పదిశాతం మించి సీట్లు భర్తీకావని భావిస్తున్నారు. మరోవైపు ఎక్కువమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో పేరున్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో తక్కువ సీట్లు భర్తీ అయిన పలు ఇంజినీరింగ్ కలాశాలలు రెండో విడతగా జరుగనున్న కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకుని ఉన్నాయి. కొన్ని కళాశాలలు తప్ప మిగిలినవాటిలో సరైన మౌలిక వసతులు లేవు. నిష్ణాతులైన అధ్యాపక బృందం ఏ కళాశాలల్లోనూ లేరు. ఆయా కళాశాలల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులనే ఎక్కువగా ఫ్యాకల్టీగా పెట్టుకుంటున్నారు. అరకొర వసతులు, జీతాలతో పలు కళాశాలలను నడిపేస్తున్నారు. దీంతో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఇలా విసిగి వేశారుతున్న విద్యార్థులు చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరళిపోతున్నారు.




