Tuesday, 3 November 2026

వేధింపుల కేసులో ఉపాధ్యాయురాలి వాంగ్మూలం

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ వేధింపుల వ్యవహారంలో ఉపాధ్యాయిని లీలావతి ఈ రోజు రాజేంద్రనగర్‌ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి 8 ఎంఎం కోర్టులో లీలావతి దాదాపు గంటపాటు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలమిచ్చారు అదృశ్యం కేసులో రాత్రి పూట ఠాణాకు పిలిపించి విచారించటం, ఎన్‌ఐ సుధీర్‌కుమార్‌ వేధింపులకు సంబంధించి ఆమె న్యాయమూర్తికి వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సుధీర్‌ను సస్పెండు చేసిన పోలీసులు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా మరిన్ని వివరాలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *