Thursday, 5 November 2026

వేములకుర్తి లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం

వేములకుర్తి లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 06 , (జనం సాక్షి) ప్రపంచ మేధావి భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేములకుర్తి లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భగా టీ ఆర్ ఎస్ నాయకులు పెంట లింబద్రి మాట్లాడుతూ రాజ్యాంగం మనుషుల మధ్య సమానత్వాన్ని చాటి చెప్పుతాయని , నీకోసం బ్రతికే నీలోనే జీవిస్తావు – సమాజం కోసం బ్రతికితే చరిత్రలో నిలిచిపోతావని ఇతరులకు మేలు చేసే పని ఏదైనా గొప్పదే అని అన్నారు. అంబేద్కర్ భౌతికంగా లేకపోయినా ప్రజల గండెల్లో నిలిచే ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.