వేములవాడ-యాదాద్రి బస్సు ప్రారంభించిన డి ఎస్పీ నాగేంద్ర చారీ

 

వేములవాడ, జూలై29( జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ నుండి యాదాద్రి లక్ష్మీ నృసింహుని దర్శించుకునేందుకు భక్తులకు వీలుగా వేములవాడ,పరిసర గ్రామాల ప్రజలకు,భక్తులకు వీలుగా వేములవాడ డి. ఎస్పీ. నాగేంద్ర చారి బస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా డి ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు, భక్తులకు గొప్ప రవాణా సౌకర్యాన్ని కల్పించిందని, ఈ సందర్భంగా వేములవాడ డిపో మేనేజర్ భీమ్ రెడ్డి ని అభినందించారు.

అనంతరం డిపో మేనేజర్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం నుండి వేములవాడ- యాదాద్రి కి ఉదయం 7.00 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు, యాదాద్రి-వేములవాడ కు ఉదయం 11.30 గంటలకు, సాయంత్రం 04.45 గంటలకు బస్సు సౌకర్యం కల్పించామని, ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ డిపో మేనేజర్ భీమ్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఆర్ టి సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు