హైదరాబాద్,నవంబరు19(జనం సాక్షి): రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కామారెడ్డిలోని గంజ్‌గేట్ సవిూపంలో హమాలి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని కొందరు దుండగులు తొఫీద్(28) అనే యువకుడిని తలపై బండరాయితో కొట్టి చంపారు. అదేవిధంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.




