Thursday, 5 November 2026

వైఎస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్బావ దినోత్సవం వేడుకలను పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భవించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. గడిచిన రెండేళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని విజయమ్మ అన్నారు.
కడస వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు, రఘురామిరెడ్డి జెండా ఎగురవేసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతల సురేష్‌బాబు, రఘురామిరెడ్డి, అంజద్‌ బాషా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైఎస్‌ఆర్‌ సీపీ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం వైఎస్‌ఆర్‌ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. మహానేత వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్‌ సర్కార్‌ నిర్వీర్యం చేస్తోందని వారు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *