రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలి: ఆర్ డీవో
నవీపేట గ్రామీణం: భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఆర్డీవో మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. నగరంలోని ఫతే నగర్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజు, ఆర్ఐ ప్రవీణ్ కుమార్, వీఆర్వో ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.