మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 29
కాలనీలలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.శుక్రవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని అయ్య నగర్లో హ్యాండ్ ఆప్ హోప్ మరియు హిల్ చర్చ్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డివిజన్ కార్పొరేటర్ సునీత యాదవ్ తో కలిసి ప్రారంభించారు.అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయించుకొని డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈకార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజు,రాము యాదవ్,సంతోష్ రామదాసు, తదితరులు పాల్గొన్నారు.




