సిఎం కెసిఆర్ సతీమణి శోభ తదితరలు హాజరు
పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని దంపతులు
హైదరాబాద్,జూలై17(జనం సాక్షి): హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం కళ్యాణ శోభతో అలరారింది. అమ్మవారి కళ్యాణ మ¬త్సవం కమనీయంగా జరిగింది. వేద మంత్రాలు, బాజా భజంత్రీల నడుమ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఎల్లమ్మను సేవించుకుని తరించారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి కల్యాణానికి ముఖ్యమంత్రి సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ బల్కంపేట అమ్మవారికి మంగళసూత్రం సమర్పించారు. మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ అందజేశారు.మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కల్యాణానికి హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరనందున ఆలయ నిర్వహకులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా బల్కంపేట వీధుల్లో భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో శివసత్తులు, ఒగ్గు కళాకారులు పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను దారిమళ్లించారు. హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు బల్కంపేటకు తరలివచ్చారు. కళ్యాణ మ¬త్సవాన్ని ఆద్యంతం వీక్షించారు. శివసత్తుల సిగాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలతో ఆ ప్రాంతమంతా ¬రెత్తింది. మూడు రోజుల పాటు జరిగే మ¬త్సవాలు బుధవారంతో ముగియనున్నాయి. చివరిరోజు ఉదయం మహాశాంతి చండీ ¬మం నిర్వహిస్తారు. సాయంత్రం ఎల్లమ్మ అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రథోత్సవం దేవాలయం నుంచి ప్రారంభమై తిరిగి అక్కడికి చేరుకున్న తర్వాత ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.




