‘అన్న క్యాంటిన్ల’లో అవినీతి

– అభివృద్ధి, హావిూల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– పార్లమెంట్‌లో టీడీపీ అవిశ్వాసానికి సీపీఐ మద్దతు ఉంటుంది
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, జులై17(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటిన్లలో కూడా అవినీతి జరుగుతోందని అన్నారు. జన్మభూమి కమిటీలు అందినకాడికి దోచుకుంటున్నాయని విమర్శించారు. అభివృద్ధి, హావిూల
అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఓటు విలువ రూ.2వేలకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆగస్టు 11, 12న రాజమండ్రిలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం జరగనుందని పేర్కొన్నారు. హావిూలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందని, బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో టీడీపీ అవిశ్వాసానికి సీపీఐ మద్దతు ఉంటుందని రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో కేవలం తెదేపా నేతలు, కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు తన అసమర్థతను ఇతర పార్టీల విూద రుద్దుతున్నాడని, నాలుగేళ్ల వరకు కేంద్రంలో కొనసాగిన చంద్రబాబు ప్రత్యేక ¬దాను విస్మరించి, బయటకు వచ్చిన తరువాత ప్రత్యేక ¬దా ఇవ్వటం లేదు, బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందని కొత్తపాట పాడుతున్నారని విమర్శించారు. తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు దీక్షలు పేరుతో, ప్రతిపక్ష నేతలను తిట్టడంతో ప్రజల్లో సానుభూతిని పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని సరైన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
——————————————

తాజావార్తలు