Tuesday, 3 November 2026

వైయస్సార్ టిపి రాజేంద్రనగర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షునిగా సదాల శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సోంటిరెడ్డి రాఘవరెడ్డి అన్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యూత్ అధ్యక్షునిగా సదాల శ్రీనివాసరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రం అందజేసిన నియోజకవర్గ కోఆర్డినేటర్ సోంటిరెడ్డి రాఘవరెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉండి పోరాడాలన్నారు.
*రాజేంద్రనగర్ నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యూత్ అధ్యక్షుడు సదాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ*
రాజేంద్రనగర్ నియోజకవర్గం లో వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలోని యువతనంత ఏకం చేస్తానన్నారు. నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో రాంరెడ్డి, సురేష్, అనిల్ కుమార్, పవన్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : వైఎస్ఆర్ టిపి యూత్ అధ్యక్షునిగా నియామక పత్రం అందజేస్తున్న కోఆర్డినేటర్ రాఘవరెడ్డి.