వైయస్సార్ సేవలు దేశానికే ఆదర్శం.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి.
తొర్రూరు.8 జూలై (జనంసాక్షి )
దివంగత నేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు దేశానికే ఆదర్శమని,తొర్రూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి అన్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కందాడి అశోక్ రెడ్డి,మండల నాయకుడు మేకల కుమార్ తో కలిసి జక్కుల రాంరెడ్డి మాట్లాడుతూ.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యంగా రైతులకు ఉచిత కరెంట్,రైతులకు ఏకకాలంలో పంట రుణమాఫీ,104,108 అత్యవసర వైద్య సేవలు,ఆరోగ్యశ్రీ,పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్,అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు,పెన్షన్,రూపాయికే కిలో బియ్యం,ఇందిర జల ప్రభ ద్వారా పేదలకు బోర్లు వేయించడం లాంటి అనేక అత్యున్నత పథకాలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని పెంచి,దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడిగా మన్ననలు పొందారని కొనియాడారు.రాబోయే ఎన్నికల్లో సిఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి,టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్,నాయకులు ఎడ్ల వెంకట్ రెడ్డి,కంచర్ల వెంకటాచారి,చింతలపల్లి గ్రామ అధ్యక్షుడు వడ్లకొండ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Attachments area