భువనగిరి టౌన్ ,,(జనం సాక్షి):– మాహబూబబాద్ జిల్లా పెద్ద వంగర్ మండలం అవుతపూర్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చడం ఒక పిరికిపంద చర్య అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్ బిఆర్ఎస్ పార్టీ పై మండి పడ్డారు.వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై ఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర లో భాగంగా అవుతాపూర్ గ్రామస్థులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని స్థాపింస్తామంటే రాష్ట్ర మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు తమ అనుచరులతో అడ్డుకున్నారని గ్రామ మహిళలు వారిపై తిరుగబడితే వెనక్కి జరిగారని అనంతరం విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందని తెలిపారు. కానీ దాని తర్వాత బిఆర్ఎస్ నాయకులు అది జీర్ణంచుకోలేక మంగళవారం రోజు ఎవరు లేని సమయం లో రాత్రి పూట విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నాయకులకు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని చూస్తేనే భయం అవుతుందని కేసీఆర్ కు వై ఎస్ షర్మిలను చూస్తే భయం అవుతుందని అన్నారు. ఎర్రవెల్లి దయాకర్ రావుకు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో ఇలాంటి పనులు చేపిస్తున్నారని అన్నారు.ఎర్రవెల్లి దయాకర్ రావ్ వెంటనే వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పాలని లేని యెడల తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూల్చడం పిరికిపంద చర్య.




