వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన

టేకులపల్లి,ఆగస్టు 23( జనం సాక్షి ):మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో, సెల్ఫ్ మేనేజ్ మెంట్ బాలికల హాస్టల్ లో స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు .పిల్లలకు ఈ సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా యుక్త వయసు బాలికల్లో వచ్చే రక్తహీనత తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు .ముఖ్యంగా మంచి పోషకాహారం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. జ్వరంతో బాధపడుతున్న ముగ్గురు పిల్లలకు రక్త పరీక్ష నిర్వహించి, మిగతా పిల్లలకు చిరు వ్యాధులకు చికిత్స అందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జయరాజు, పరంగిని, స్టాఫ్ నర్స్ ప్రసన్న, వార్డెన్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.