హైదరాబాద్: నగరంలోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బడంగ్‌పేటలో వ్యక్తి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు వ్యక్తి గొంతు కోసి హత్య చేశారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




