హైదరాబాద్: హైదరాబాద్లోని నల్లకుంట, అంబర్ పేట్ లో ఇద్దరు భార్యభర్తలు నడుపుతోన్న వ్యభిచార గృహాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తెప్పించి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తోన్న ఇద్దరు భార్యభర్తలను అరెస్టు చేశారు. మరో ఐదుగురు వ్యక్తులను, ఎనిమిది మంది బంగ్లాదేశ్ అమ్మాయిలను కూడా అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.




