వ్యవసాయం మీద అసలు అవగాహన లేని వ్యక్తి టీపీసీసీ రేవంత్ రెడ్డి
*వ్యవసాయం చేయనోడికి ఎన్ని గంటలకు కరెంట్ కావాలో ఏం తెలుసు
రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో పాతాళంలో పాతి పెట్టాలి
ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
జనం సాక్షి సైదాపూర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం అని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో రైతువేదిక వద్ద రైతులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ గారఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ…వ్యవసాయానికి కరెంట్ ఇస్తలేరు అని రైతులు ఏమైనా ఫిర్యాదు చేశారా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాంటి వారికి వ్యవసాయం అంటే తెలుసా ఆయన ఏనాడైనా వ్యవసాయం చేశాడని ప్రశ్నించారు.కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ ని ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మళ్ళీ అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నదని, వారి పాలనలో ఏనాడు పగటిపూట కరెంటు ఉండేది కాదని రాత్రిపూట రైతులు పంటపొలాల వద్ద జాగారం చేసే పరిస్థితి ఉండేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ తో ఇస్తుండటంతో రైతులు మూడు పంటలు పండిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతు రాజ్యం అంటే కేవలం మాటల్లోనే కాక దాన్ని చేతల్లో చేసి చూపించిన ఘనత గౌరవ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతలు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, రైతులందరూ బాగుంటే రేవంత్ రెడ్డి లాంటి వారు పరేషాన్ లో ఉన్నారని ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రైతులను రాజకీయ ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప ఏనాడు వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేయలేదని కాంగ్రెస్ తీరును ఎత్తిచూపారు.రాష్ట్రంలో ధాన్యం సేకరణలో కేంద్రం చేతులెత్తితే సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారన్నారని పేర్కోన్నారు.రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతులను ఆదుకుంటుంటే కాంగ్రెస్ ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు?రాష్ట్రంలో రైతులు మూడు గంటల కరెంటు కావాలా? మూడు పంటల బీఆర్ఎస్ పార్టీ కావాలో తేల్చుకొవాలని కోరారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో పాతాళంలో పాతిపెట్టాలని సూచించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, 3 గంటలు వద్దు 3 పంటలు కావాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రైతుల హర్షద్వానాల మధ్య ఆమోదించారు.