కేసముద్రం ఆగస్టు 25 జనం సాక్షి / మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (కేసముద్రం)వారి ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందజేసిన ఈనామ్ ప్రధానమంత్రి ఎక్స్ లెన్సీ అవార్డు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేసిన 6,20,000నగదు ప్రోత్సాహక పంపిణీ కార్యక్రమం మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీబాయి(డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ),ఆర్ లక్ష్మణుడు(అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ)హాజరై వారు మాట్లాడుతూ….కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ విధానాన్ని అమలు చేస్తూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అమలు చేయడంతో పాటు,కార్మిక వ్యాపార ఉద్యోగ వర్గాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, సద్దిమూట కార్యక్రమంలో నాణ్యమైన భోజన వసతి,మార్కెట్కు గణనీయమైన ఆదాయం తీసుకురావడం పట్ల జాతీయస్థాయిలో ప్రధాని ఎక్స్లెన్స్ అవార్డు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పొందడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ ను,సిబ్బందిని సహకారం అందించిన అన్ని వర్గాల వారిని అభినందించారు.అనంతరం మార్కెట్ సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు పంపిణీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ బి.ఉపేందర్,స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్వర్లు ,మార్కెట్ కార్యదర్శి యన్. రాజా,సూపర్వైజర్ రాజేందర్,అతిథులుగా విచ్చేసిన సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




