దౌల్తాబాద్ మండల కేంద్రంలో వ్యవసాయ కమిటీ కార్యాలయం లో చైర్మన్ ఇప్ప లక్ష్మి అధ్యక్షతన పాలకవర్గంతో సాధారణ సమావేశం నిర్వహించారు. అనంతరం వ్యవసాయ కమిటీ పాలకవర్గంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నదాతలకు రైతుబంధు పేరుతో ఎకరానికి 5000 రూపాయలు చొప్పున పెట్టుబడి ఆర్థిక సహాయం అందజేయడం సంతోషకరమని అన్నారు. విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యంగారి యాదగిరి, వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కేంసారం నాగరాజు, లింగం, సత్తయ్య, లక్ష్మణ్,జహంగీర్,తుడుం లక్ష్మి, వెంకటరాంరెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు ఇప్ప దయాకర్,తుడుం నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.




