వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ముందు బైఠాయించిన మహిళ*
కోదాడ సెప్టెంబర్ 1 (జనం సాక్షి): మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి వీర కుమారి భర్త సైదులు(లేట్) అనే మహిళ ఆఫీసు ముందు ధర్నాకు దిగింది గత రెండు నెలల క్రితం తన భర్త సైదులు కూచిపూడి గ్రామంలో చనిపోయాడు అట్టి రైతుకు ఐదు గంటల వ్యవసాయ భూమి ఉన్నది దానికి గాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన,5 లక్షల ఇన్సూరెన్స్ రైతు బీమా వచ్చింది కానీ అది బాధిత కుటుంబంలోని తన భార్యకు ఇవ్వ కుండా శెట్టి వెంకటేశ్వర్లు, అనే వ్యక్తి కి వచింది అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా సంఘ నాయకురాలైన అంకతి అనసూర్య మాట్లాడుతూ
తన భర్త చనిపోయినందుకు. తన కొడుకుకి రైతు బీమాఇవ్వాలి కానీ వేరే వ్యక్తికి అకౌంట్లో ఎలా వేస్తారు అని అధికారుల ను డిమాండ్ చేశారు .ఈ బీమా కోసం దరఖాస్తు పట్టుకుని ఎన్నిసార్లు అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన దరఖాస్తు స్వీ కరించకుండా వెనక్కి పంపడం దుర్మార్గమైన చర్యని ఆమె ఎద్దేవా,చేశారు. ఐదు లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ వారువెంటనే బాదిత కుటుంబానికి అందించాలని. కూరారు లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అధికారులు స్పందించాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనతోపాటు మిగతా మహిళా సంఘాల నాయకులు అందరూ తనకు అండగా నిలబడ్డారు.