హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ వల్లోజు రామలింగయ్య మృతి
మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): మునగాల మండల కేంద్రానికి చెందిన శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ వల్లోజు రామలింగయ్య(92) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. దాదాపు 20 సంవత్సరాలు గుడి చైర్మన్ గా కొనసాగడాని, ఎకరం పొలం హనుమాన్ దేవాలయానికి దాతగా ప్రకటించి వచ్చిన ధాన్యాన్ని నిత్య దీపారాధనకు నిత్య ప్రసాదాలకు ఇస్తుండేవాడు. గుడిలో ఏ కార్యక్రమం అయినా చురుకుగా పాల్గొనేవాడు. బలమైన హనుమాన్ భక్తుడు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా మొదట హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకునేవాడని పలువురు తెలిపారు. రామలింగయ్య, అతని భార్యకు 2020 సంవత్సరంలో కరోనా సోకడంతో తన భార్య సుగ్రీవమ్మ మరణించింది. కానీ రామలింగయ్య మాత్రం కరోనాను జయించి బతికాడు. అలాంటి మంచి దాత మరణించడం గ్రామానికి వారి కుటుంబానికి తీరనిలోటని, గ్రామంలోని పలువురు నాయకులు ఆయన మృతదేహానికి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది.