శక్తి కేంద్రాలతో పార్టీ పటిష్టం
వేమనపల్లి, సెప్టెంబర్ 23 (జనంసాక్షి)
వేమనపల్లి మండలకేంద్రంలో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రాల సమావేశానికి ముఖ్యఅతిధిగా పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్లు హాజరుయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ కమిటీలను నియమించడంతోపాటు ప్రతి ఐదు బూత్ కమిటీలకు శక్తి కేంద్రం బాధ్యులను నియమించారని సూచించారు.శక్తి కేంద్రాలతో పార్టీ పటిష్ఠమవుతుందన్నారు. శక్తి కేంద్రం బాధ్యులు సక్రమంగా పనిచేయకుంటే తక్షణమే వారిని ఆ పదవి నుంచి అధిష్టానం తప్పిస్తుందని అన్నారు.ఎన్నికల్లో పార్టీ గెలుపునకు బూత్ కమిటీలదే కీలకపాత్రని ఆయన పేర్కొన్నారు.ఇప్పటి నుంచి ఎన్నికల వరకు బీజేపీ ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో బూత్ కమిటీ సభ్యులు బీజేపీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపా ద్యక్షులు ఏట మధుకర్,ప్రధాన కార్యదర్శి గణపురం సంతోష్,కొరకొప్పుల వంశీ,బూత్ అధ్యక్షులు కోయిల స్వామి,మానేపల్లి పోచం,ఎనుముల వెంకటేష్, చౌదరి వెంకటేష్,దొబ్బల సంతోష్,పందుల అశోక్,చల్ల రాజన్న, చౌదరి సుధాకర్, చౌదరి రాజన్న,దుబ్బుల సంజీవ్, చౌదరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.