శాంతినగర్ లో గాంధీ జయంతి సందర్భంగా వి ఆర్ ఏ ల మౌన దీక్ష

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 2 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విఆర్ఏలు మౌన దీక్ష చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వి ఆర్ ఏ ల నిరవధిక సమ్మెలో భాగంగా 70 వ రోజు వినూత్నంగా గాంధీ జయంతి సందర్భంగా ఆయన పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మౌన దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మన్న, మమత, పాండు, సొరగారి పెద్ద బీచుపల్లీ,కృష్ణ,ఈశ్వర్, బడేసాబ్,బుచ్చన్న, విజయుడు వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.