*భారతీయుల గుండెల్లో స్వేచ్చా వాయువులను నింపిన మహానీయుడు మహాత్మా గాంధీ.. డా. సత్యం శ్రీరంగం.”
కూకట్ పల్లి జనంసాక్షి :మహాత్మ గాంధీ 153వ జయంతి సందర్బంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలో గాంధి ఐడియాలజీ సెంటరులో ఏర్పాటు చేసిన గాంధి విగ్రహాన్ని టీపీసీసీ అధ్యక్షులు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండా ఎగరవేసారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి జిల్లా పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి లు అనంతరం బాలానగర్ లో బండారి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సత్యం శ్రీరంగం హాజరై జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి భారతీయులందరిచే ఆదరింపబడే గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు గాంధీ అని ఆయనను ప్రజలు జాతిపితగా గౌరవిస్తారని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి భరతమాత దాస్య శృంఖలాలను తెంచి కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్వేచ్చా వాయువులను నింపిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, విశ్వమానవాళికి శాంతి, అహింసా సిద్ధాంతాలను ప్రబోధించి అవి మాత్రమే సుఖంగా, సంతోషంగా, స్థిరంగా ఉంచగలవని సందేశాన్నిచ్చి అనేక వర్ధమాన దేశాల చరిత్రలను ప్రభావితం చేసిన మహోన్నతుడు గాంధీ అన్నారు. జాతీయ ఐక్యత, మత సామరస్యం, సమానత్వం, అంటరానితనం నిర్మూలనం, మహిళా విముక్తి, మద్యపాన నిషేధం, నూతన విద్యా విధానం, పేదరిక నిర్మూలన, ఆర్ధిక స్వాలంబన, గ్రామా స్వరాజ్యం, శాంతియుత సహజీవనం వంటివి ఆయన ఆలోచనలని, ఆయన ఎన్నో సేవలు, త్యాగాలు చేసినా ఎలాంటి రాజకీయ పదవులను ఆశించకుండా ప్రజా సేవకుడిగా చరిత్రలో మిగిలిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, రాము, రవి ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రావణ్ పటేల్, మాట్టే ప్రసన్న కుమార్, ముకేందర్, మహేందర్, గజానంద శేఖర్, రిషీ యాదవ్, రాజు గౌడ్, వినోద్, భరత్ కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




