శ్రీ తుల్జాబావని మాత ఆలయంలో నామా రవికిరణ్ దంపతులు ప్రత్యేక పూజలు

జహీరాబాద్ అక్టోబర్ 2 (జనంసాక్షి ) మొగుడం పల్లి మండలoలోని ఖంజమాల్ పూర్ భవానమ్మ పల్లి గ్రామంలో మహాత్మా ఛత్రపతి శివాజీ చే నిర్మించిన {శ్రీ తుల్జా భవాని మాత ఆలయం వెలసిన సందర్భంగా దసరా నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ఆదివారం నామ సుభద్రమ్మ ట్రస్ట్ అధ్యక్షుడు నామ రవి కిరణ్ దంపతులు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ విశిష్టత అడిగి తెలుసుకున్నారు.ఇంత పేరు గాంచిన ఆలయానికి అధిక సంఖ్యలో భవాని మాత భక్తులు దర్శించుకోవాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు కృష్ణ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.