Tuesday, 3 November 2026

శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు

బీర్‌కూర్‌ రూరల్‌: గ్రామంలో అల్లర్లకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని బాన్సువాడ గ్రామీణ ప్రకాష్‌ సీఐ ప్రకాష్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం బీర్‌కూర్‌ మండలం దుర్కి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధుసూదన్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *