*శాంతి, స్నేహ ప్రతిరూపాలు గా ఈద్ మిలాద్ ఉన్ నబి:మాజీ మంత్రి చిన్నారెడ్డి*

పెబ్బేరు అక్టోబర్ 09 (జనంసాక్షి):
ఈద్ మిలాద్ ఉన్ నబి సందర్భంగా పెబ్బేరు లోని  జామియా మసీదు లో  ముస్లిం సోదరులకు
ఏఐసీసీ కార్యదర్శి,టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచశాంతి, సోదరభావం,స్నేహశీలతకు, ప్రతిరూపమైన ఈద్ మిలాద్ ఉన్ నబి  అన్నారు.  మహమ్మద్ ప్రవక్త  పవిత్రమైన రోజు సందర్భంగా  జామియా మాజీద్ కమిటీ పిలుపుమేరకు విచ్చేసిన డాక్టర్ జి చిన్నారెడ్డి  జామియా మసీదులో ముస్లిం సోదరులను కలిసి ఈద్ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దుల విజయవర్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్ సాగర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్రమొని రాములు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ చంద్రశేఖర్, బీముడు, బుచ్చిబాబు,ఎండి అప్సర్,ఎం.డి.షకీల్, అరుణ్ రషీద్,అతిక్ పాష, జహంగీర్,ఎం.డి.సాధిక్, మైనద్ధిన్,ఎం.డి.రహీమ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
Attachments area