Wednesday, 4 November 2026

శామీర్‌పేట్‌ ఎస్‌బీహెచ్‌లో చోరీకి దొంగల యత్నం

రంగారెడ్డి, సెప్టెంబరు 9 : శామీర్‌పేట్‌లోని స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌లో గుర్తుతెలియని దొంగలు చోరీకి యత్నించారు. గత రాత్రి గ్యాస్ కట్టర్‌తో బ్యాంకు వెనుకభాగం నుంచి లోపలకు చొరబడేందుకు దుండుగులు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటువైపు రావడంతో దుండగులు పరారయ్యారు. చోరీకి యత్నించిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా  గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *