హైదరాబాద్: శామీర్‌పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు వ్యక్తులపై దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 2లక్షల నగదును దోచుకెళ్లారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




