Wednesday, 4 November 2026

శామీర్ పేట్ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శామీర్ పేట్, జనం సాక్షి :
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట (షామీర్పేట్ )లో స్వతంత్ర భారత వత్రోత్సవాల వేళ ప్రతి ఇంటిపై మువ్వన్నెల పతాకం ఎగురవేయాలన్న సంకల్పంతో జండాలను చేపట్టి మంగళవారము శామీర్పేట్ గ్రామంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇస్రాత్ విద్యార్థులు పి.డి ఇతర అధ్యాపక బృందము జెండాలతో ర్యాలీ నిర్వహించారు.8 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రోజు వారి కార్యక్రమాలలో భాగంగా పదవ తేదీ బుధవారం రోజున జాతీయ గీతాలాపన, జండా ప్రదర్శన, పిరమిడ్ ప్రదర్శనలు ఇంకా పలు ప్రత్యేక కార్యక్రమాలను కళాశాల విద్యార్థులు ప్రదర్శించారు . ఈ విధంగా కళాశాల ప్రిన్సిపల్ మువ్వన్నెల జెండా ర్యాలీలో స్వతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పడం గురించి ఉపన్యసించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట (షామీర్పేట్) ప్రిన్సిపల్ డాక్టర్ ఇస్రాత్ ఇలలో ఇలాగా ఊపందుకుంటున్న వేళలో సహకరించిన కళాశాల అధ్యాపకుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
10ఎస్పీటీ -1: విద్యార్థుల విన్యాసాలు