శామీర్ పేట పెద్ద చెరువు నిండి అలుగులు
ఆనందంలో పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు : శామీర్ పేట్, జనం సాక్షి :
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శామీర్ పేట పెద్ద చెరువు అలుగులు దుకుతుండడంతో శామీర్పేట గ్రామ ప్రజలు ఆందోత్సాహాలను వ్యక్తం చేశారు. శుక్రవారం పెద్ద చెరువు వద్దకు గ్రామ నాయకులు, కమిటీ సభ్యులు చెరువు నిండిన సంతోషంలో చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ యేడు కూడ పెద్ద చెరువు నిండి అలుగులు దూకుతుండడంతో శామీర్పేట గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు చెరువును సందర్శించి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. చెరువు నిండడంతో ఇక రైతులకు నీటి సమస్య ఉండబోదని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో బిఆర్ ఎస్ మండల పార్టీ అద్యక్షుడు సుదర్శన్, ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణ, కోశాధికారి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి,ఉపసర్పంచ్ నర్ల రమేశ్, వార్డు సభ్యులు ఉప్పలయ్య, శ్రీకాంత్, ఉమర్, రవి, సత్యనారాయణ, నాయకులు మహేందర్ యాదవ్, వై ఎస్ గౌడ్,
ఐలయ్య యాదవ్, కట్టమైసమ్మ ఆలయ కమిటి సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
28ఎస్పీటీ -2: చెరువు కట్టకు పూజలు చెయ్యడానికి వెళ్తున్న నాయకులు
చెరువు అలుగుల దూకుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు