Tuesday, 3 November 2026

శాసనసభలో కాగ్‌ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టింది. జలయజ్ఞం, ఉపాధి హామీ పథకాల్లో లోపాలను కాగ్‌ని వేదిక వెల్లడించింది. కృష్ణా వరద జలాలపై ఆధారపడి చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల మనుగడ సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. గాలేరి-నగరి, వెలిగొండ, శ్రీశైలం, ఎడమగట్టు కాలువ విషయంలో నీటి లభ్యత రుజువు చేయలేదని, దీని వల్ల కేంద్ర జలసంఘం ప్రతిపాదనలను తిప్పిపంపిందని తెలిపింది. 26 ప్రాజెక్టుల అమలుకు సంబంధించి నిర్ధిష్ఠ వ్యయం రూ. 52,116 కోట్ల మేర పెరిగిందని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *