హైదరాబాద్ : సభలో చర్చించేందుకు వివిధ అంశాలపై విపక్షాలు స్పీకర్‌కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ దౌర్జన్యాలపై తెదేపా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వయోపరిమితి పెంపుపై వైకాపా, తెలంగాణ తీర్మానంపై తెరాస, నాగం జనార్థన్‌రెడ్డి, స్థానిక ఎన్నికల్లో మతపరమైన రిజర్వేషన్ల కారణంగా బీసీలకు నష్టంపై భాజపా, ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.




