హైదరాబాద్ : విపక్షాల ఆందోళనల మధ్య శాసన సభ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి.ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. తెలంగాణ తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్ పోడియం చుటుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.




