హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో విపక్ష వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్ సమస్యలపై తక్షణమే చర్చ చేపట్టాలని తెదేపా, వామపక్షాల సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత స్వల్ప కాలిక చర్చకు అనుమతిస్తామని స్పీకర్ చెప్పినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు.




