హైదరాబాద్ : వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో విపక్ష సభ్యులు శాసన సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్ సమస్యపై తక్షణమే చర్చ చేపట్టాలని తెదేపా, వామపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. విద్యుత్ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.




