Wednesday, 4 November 2026

శాసన సభ మరోసారి వాయిదా

హైదరాబాద్‌ : విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య శాసనసభ రెండోసారి వాయిదా పడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రరంభం కాగానే తెదేపా, తెరాస సభ్యులు తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగించారు. బాబ్లీపై చర్చకు పట్టుబడుతూ తెదేపా, తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నిరసనకు దిగారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే గంటపాటు వాయిదా పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *