హైదరాబాద్: ప్రజల్లోని మూఢ నమ్మకాలు పోగొడితేనే సమాజాభివృద్ధి జరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో శాస్త్ర అవగాహన కల్పించటంలో జన విజ్ఞానవేదిక మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జన విజ్ఞాప వేదిక పాతికేళ్ల వార్షికేళ్ల వార్షికోత్సవ కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయటంలో 25 ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ప్రజల్లోకంటే రాజకీయ నాయకుల్లోనే ఎక్కువ మూఢనమ్మకాలున్నాయని, ప్రభుత్వ క్వార్టర్లలోనూ వారు వాస్తు కోసం వెతుకుతుంటారని ఈ సందర్భంగా ఆయన చమత్కరించారు. వాస్తు ఉన్న ఇళ్లయితే అవినీతికి పాల్పడినా, కేసుల బారిన పడరని నేతలు విశ్వసిస్తారని వ్యాఖ్యానించారు.




