Tuesday, 3 November 2026

శిథిలావస్థలో ఉన్న కుటుంబాలను పరామర్శించిన సర్పంచ్ రాజేందర్.

(జనంసాక్షి). మండల పరిధిలోని  వెల్మకన్న గ్రామంలో వరసగా వారం రోజుల నుండి వర్షాలు పడుతున్న కారణంగా కూలిపోయే దశలో ఉన్న మంగలి వెంకమ్మ , తుక్కుపురం భూషణం గార్ల పురాతన ఇండ్ల వద్దకు వెళ్లి వారు నివాసం ఉంటున్న కుటింబాలను సందర్శించి,వారికి అవగాహన కల్పించి  ఇండ్లను కాలి చేసి ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉండాల్సిందిగా  సర్పంచ్ ఖాజిపేట రాజేందర్  కోరడం జరిగింది.మంగలి వెంకమ్మ కుటుంబ సభ్యులను అంగన్ వాడి కేంద్ర భవనంలో ఉండాల్సిందిగా సూచించడం జరిగింది.వర్షాలు పడుతున్న కారణంగా విద్యుత్ స్తంబాలకు దూరంగా ఉండాలని, చెరువులకు దూరంగా ఉండాలని  సూచించారు. భూషణం యొక్క కుటుంబాన్ని తన ఇంటి ఎదురుగా ఉన్న ఇంటిలో ఉండాల్సిందిగా సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కారోబర్ కైల నాగభూషణం, వీఆర్ఏలు చాకలి భిక్షపతి, మసీరి రవి లు ఉన్నారు.
Attachments area