Wednesday, 4 November 2026

శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన ఎర్ర చందనం స్మగ్లర్లు

కడప: శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. అటవీ అధికారులపై దాడులకు తెగబడ్డారు. వాటికొన సమీపంలో మంగళవారం నాడు ఎర్రచందనం స్మగ్లర్లకు అటవీ సిబ్బందికి ఎదురుపడ్డారు. దీంతో స్మగ్లర్లు సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ స్మగ్లర్లు దాడి ఆపకుండా వెంబడించడంతో అటవీ సిబ్బంది చెట్ల మధ్యన నక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. స్మగ్లర్లు అక్కడి నుంచి పారిపోయాక రూ. 50 వేల ఎర్రచందనంను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *