భయాత్రలో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్
జహీరాబాద్ మార్చి 30 (జనం సాక్షి ) శ్రీరామ నవమిని పురస్కరించుకుని పట్టణంలో శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు జరుగుతున్న శ్రీ రాముని శోభ యాత్రలో ముఖ్య అతిథిగా హాజరై గుమ్మడి కాయ కొట్టి ర్యాలీని ప్రారంభించిన స్థానిక జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ నిర్వహకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు, ఈ సందర్భంగా ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతూ శ్రీరాముని దివ్య ఆశీస్సులతో ప్రజలందరు అష్ట ఆయురారోగ్యాలతో ఉండి అన్ని మహమ్మరిలు అంతం అయి ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని ప్రార్ధించారు, అనంతరం పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ స్థానిక ఎమ్మెల్యే మణిక్ రావు లకు పూలమాల శాలువకప్పి ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే మణిక్ రావు, జె కె చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్, గుంజోటి ఎంపిటిసి బొమ్మ దేశెట్టి పాటిల్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గౌని శివకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాష్, అల్లాడి నర్సింలు, మాజీ కౌన్సిలర్ బెజగం సతీష్, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు విజయ్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రంగ అరుణ్ కుమార్, బి రాజ్ కుమార్ మనియర్ పల్లి, బి ఆర్ ఎస్ నాయకులు దత్తు పాటిల్, రాఘవేందర్, రవికాంత్, ఝారసంగం మండల సీనియర్ నాయకులు శ్రీకాంత్ పాటిల్, డైరెక్టర్ కొత్తకాపు గోవర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప,తదితరులు పాల్గొన్నారు.
శోభయాత్రలో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్శో




