శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వేముల దంపతులు
శ్రీ కృష్ణాష్టమి(గోకుళాష్టమి) పురస్కరించుకుని వేల్పూర్ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రీ కృష్ణ భగవానుడి కృపతో కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి వేముల కాంక్షించారు.