Wednesday, 4 November 2026

శ్రీకృష్ణ గోపిక వేషాధారంలో ఆకట్టుకున్న బాలబాలికలు..

ములుగు,ఆగస్20(జనం సాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని వేణుగోపాల స్వామి  ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని బాల బాలికలు శ్రీకృష్ణుని వేషధారణ మరియు గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా బాలబాలికలు కృష్ణ అవతారంలో గోపిక అవతారంలో భక్తులకు ఆకట్టుకున్నారు.