Wednesday, 4 November 2026

శ్రీనివాస్ పూర్ లో భాజపా పార్టీ జెండా ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్

 

 

 

 

 

 

సబ్జెక్టు జనం సాక్షి న్యూస్ /ఫిబ్రవరి 11/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గంశనివారం తుర్కపల్లి మండలంలోని శ్రీనివాస్ పూర్ గ్రామం లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలేరు మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వస్తుందని అన్నారు. శ్రీనివాస్ పూర్ గ్రామానికి కొండాపూర్ నుండి రోడ్డు వేస్తామన్నరు, డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామన్నారు.. ఇరవై నాలుగు గంటల కరంటు రావడం లేదు,సబ్సిడీ ఎత్తేశిండు.గ్రామాలకు బెల్టు షాపులను మాత్రం అభివృద్ధి చేశారు.నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. కేంద్రంలో బీజేపీ
అధికారంలో ఉంది… రాబోయే ఎన్నికల్లో రాష్టం లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొక్కొండ లక్ష్మీ నారాయణ, అధికార ప్రతినిధి డొంకన రాజు గౌడ్, పడాల శ్రీనివాస్, జక్కుల వెంకటేష్, శత్రు నాయక్,ర్యకాల రమేష్, బర్ల లచ్చియ్య, మాలోత్ శ్రీనివాస్, బానోత్ నరేందర్, వాంకుడోత్ రాము, గోనె కృష్ణ, మేకల పాండు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.