Tuesday, 3 November 2026

శ్రీవారి హుండీ లెక్కింపు.

.జనంసాక్షి.జూలై 13
మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి  దేవస్థానంలో స్వామి వారికి భక్తులు  హుండీలోసమర్పించిన కానుకలను గురువారం ఎండోమెంట్  పర్యవేక్షణ అధికారిణి పి.నవ్య రెడ్డి సమక్షంలో లెక్కించగా 2,61031(రెండు లక్షల అరవైఒక్క వెయ్యి ముప్పై ఒక్క రూపాయి) ఆదాయం వచ్చింది.
54రోజుల ఆదాయమని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎబి రవీంద్ర రెడ్డి తెలిపారు.హుండీ లెక్కింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎబి రవీంద్ర రెడ్డి,ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణా చార్యులు,అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు,క్లర్క్ సండ్రా సుధాకర్,ఆలయ మాజీ చైర్మన్లు ఉమేష్ సింగ్,రామదాసు సంతోష్ ముదిరాజ్, మాజీ ధర్మ కర్తలు, గణేష్,రవీందర్,భక్తులు,సుధారాణి,జయశ్రీ ,నాగేశ్వర రావు,గిరీష్,మీనాక్షి,వీణామాధురి.రత్నమాల,
రత్న మాణిక్యం,వాణి,తదితర భక్తులు పాల్గొన్నారు..