శ్రీశైలం,అక్టోబర్20(జనంసాక్షి ): కొద్దిరోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద నీరురావడంతో శ్రీశైలం నిండుకుండలా పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఎగువన వరదతో దిగువన సాగర్‌కునీరు వదిలారు. దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపించింది. అయితే తాజాగా ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 94,500 క్యూసెక్కుల ఇన్‌ఎ/-లో వస్తుండగా, ఔట్‌ఎ/-లో 90,492 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 884.10 అడుగులు ఉండగా, నీటి నిల్వ 210 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టలోని 13 యూనిట్ల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చిన నేపథ్యంలో ఎనిమిది గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే..!




