కొండమల్లేపల్లి జనవరి 31 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలో వెంకటేశ్వర నగర్ దేవరకొండ రోడ్ లో గల శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవమునకు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ మహోత్సవమునకు స్వస్తిశ్రీ శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ ఏకాదశి తేది: 01-02-2023 బుధవారము నుండి శుక్రవారము 03-02-2023 వరకు తేది: 01-02-2023 బుధవారం ఏకాదశి ఉదయం గం॥ 08:01 లకు మంగళవాద్య సంఘషణ గణపతి ప్రార్థన వేద స్వస్తి గోపూజ భూతబలి, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ శైవశుద్ధి మహా పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, ప్రాశనం, యంత్ర విగ్రహ మార్జనలు, రుత్విక్ వరుణ దీక్షాకంకణధారణ, అఖండ దీపారాధన, మూల మంత్ర జపములు, అగ్రరాజ అర్చన, నీరాజ మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ. సా॥ 05:00 గం॥ లకు మృత్సంగ్రహణ అంకురారోపణ మహా మంటప ఆవాహన అగ్ని ప్రతిష్టాపన మూలమంత్ర హోమములు, నవకలశ అర్చన ద్వాదశాలాపన జలాధివాస సహిత క్షీరా అదివాసం తరంగా వాహనములు నిత్య బలిహరణ నీరాజన మంత్రపుష్పములు రాజోపచారములు తీర్థ ప్రసాద వితరతేది: 02-02-2023 గురువారము ద్వాదశి ఉ॥ 07:30 గం॥ లకు వేద స్వస్తి గవ్యాంత పూజలు ప్రాతరౌఉపాసన వాస్తుపూజ, వాస్తుహోమ, వాస్తుబలి, పర్యగ్నికరుణ, లక్షనోధారణ గ్రామ ప్రదక్షిణ గ్రామబలిహరణ, ధాన్యాధివాసము, మూలమంత్ర సహిత ధాన్యదివస హవనములు నిత్యబలిహరణ నీరాజనం మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ. సా|| 05:00 గం॥ లకు సాయమౌపాసన ఆవరణ మూలమంత్ర హవనములు, శాంతి కుంభ స్థాపన యాగశాల విశేషార్చనలు, పంచశయ్యాదివాస సహిత వస్త్ర, పుప్పు, ఫల ధనాది, వాసములు, శాంతి హోమ, దిశా హోమ, కళా హవనములు, నిత్య బలిహరణ రాజోపచారములు నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద మూడవ రోజు తేది: 03-02-2023 శుక్రవారము మూడవ రోజు తేది: 03-02-2023 శుక్రవారము ఏకాదశి ఉ॥ 08:00 గం॥ లకు వేద స్వస్తి గవ్యాంత పూజలు, యంత్ర నిగ్రహ మార్జనలు పాత్రరోపాసన ఆవరణ, మూలమంత్ర హవనములు పీఠపూజ, గర్తవ్యాసం, రత్నన్యాసం ఉ॥ గం॥ 11:42 ని||లకు పునర్వసు నక్షత్ర యుక్త మేష లగ్న పుష్కరాంశమున శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి, గణపతి సుబ్రహ్మణ్య స్వామి సింహవాహన బలిపీఠ శిఖర ద్వజస్తంభ నవగ్రహ పోతురాజు యంత్ర నాగ బంధం, జంట నాగులు విగ్రహ ప్రతిష్టామహోత్సవము మహ పూర్ణాహుతి, జీవన్యాసం, ప్రాణప్రతిష్ట, ఆలయ శిఖర విగ్రహములకు మహాకుంభాభిషేకం, మహోత్సవము దిష్టి కుంభం, మహాదర్శనం, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ మహాదాశీర్వచనం, పండిత సన్మానం, అన్నసంతర్పణ, సా|| 08:00 గం|| లకు రేణుక జమదగ్ని స్వామి వార్ల బద్యకళ్యాణ మహోత్సవం.అన్నదాన కార్యక్రమం కలదుభక్తులు నవధన్యాలు, ముత్యం, పగడాలు, బంగారం ప్రతిష్ట సమయంలో వేయగలరు కావున భక్తులు అందరూ ఇట్టి మహాతరమైన కార్యక్రమములో భక్తిరూపేనా పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము




