శ్రీశ్రీ నగర్ లో సామూహిక కుంకుమార్చనలు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
వినాయక నవరాత్రులను పురస్కరించుకుని స్థానిక శ్రీశ్రీ నగర్ లో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద సోమవారం మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 30 వార్డ్ కౌన్సిలర్ పల్స మహాలక్ష్మీ మల్సూరు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కుంకుమార్చల వల్ల లక్ష్మీ కటాక్షంతో అష్టశ్వర్యములు,సౌభాగ్య సిద్ధి,మాంగళ్య సిద్ధి లభిస్తుందని తెలిపారు.వేడుకలను భక్తి శ్రద్ధలతో పాటు, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.ఈ సందర్భముగా వేద పండితులు చిట్టి సాయిశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు లక్ష్మీ దేవిని స్తుతిస్తూ మంగళ హారతులతో పాటలు పాడారు.ఈ కార్యక్రమంలో గేల్లా శ్రీదేవి, బచ్చు నీరజ, గడగోజు కోమలి, ప్రగడ శిరీష, ప్రగడ రమ్య, గడ్డం ప్రమీల, దొడ్డ సువర్ణ, మర్రు సుశీల, పోనుగోటి జ్యోతి , చింత అన్నపూర్ణ, కొత్తపల్లి అరుణ, తన్నీరు సత్తెమ్మ, ప్రగడ ఉపేంద్ర, బద్దం మంజుల, పిన్నమ్ హైమావతి, ఉప్పునూతల ఉష , నిమ్మల అరుణ, గుమ్మడ వెళ్లి విజయ,మరకాల నాగమణి, తదితరులు పాల్గొన్నారు.