చిలుకూరు: మండలంలోని రామాపురం గ్రామాలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మహిళలు శనివారం పాలపొంగళ్లతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఏటా ఉగాది పండుగకు ముందు శనివారం ఈ గ్రామంలో దేవాలయం వద్ద మహిళలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ విధంగా పూజలు నిర్వహించడం ద్వారా గ్రామానికి అరిష్టాలు రావని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని అక్కడి ప్రజల విశ్వాసం, ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు వేమూరి నాగేశ్వరరావు, తిపిరిశెట్టి వీరయ్య, వెంకయ్య, ఆలయ పూజారి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.




