శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నాలుగవ రోజు అన్నదాన కార్యక్రమం.

-ముఖ్య అతిథిగా ములుగు సిఐ గుంటి శ్రీధర్.

ములుగు, సెప్టెంబర్ 4(జనంసాక్షి):-
ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ మెయిన్ రోడ్ ములుగు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు నాలుగవ రోజు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది .ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ములుగు సిఐ గుంటి శ్రీదర్ చేతుల మీదగా అన్నదాన ఆర్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని ధనాలలో అన్నదానం చేయడం మంచిదని అన్నారు.హిందూ ముస్లిం బేధాలు లేకుండా మనం అందరం భారతీయులమని అన్నారు .ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఉత్సవ కమీటీ ని ప్రోత్సహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం అనంతరం శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ములుగు సి ఐ గుంటి శ్రీధర్ ను షాలువతో సన్మానించడం జరిగింది. అన్నదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు కమిటీ సభ్యుల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులందరు పాల్గొనడం జరిగింది.